logo

ఎన్నికల వేళల్లోనే ఎందుకింత.. అక్రమ రవాణా బంగారం దొరుకుతుంది. ఇదెలా సాధ్యం..


ఈ రోజుల్లోనే నిఘా పటిష్టంగా ఉండడం వల్లనా లేక సందిట్లో సడేమియాలా బంగారు వ్యాపారులు ప్రభుత్వం కన్నుగప్పి లెక్క పత్రాలు లేకుండా అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నారా. లేదా ఎన్నికల తాయిలాలు కోసం రాజకీయ పార్టీల నేతలు తరలిస్తున్న బంగారమా.. ఎవరిదీ లెక్క. ఎన్నికల తర్వాత ఈ సీజ్ ఐన సొత్తు ఏమౌతుందో ఎటువంటి అధికారిక ప్రకటన ఉండదు.

ఐనా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉన్న ఎన్నికల కోడ్ లోనే ఇంత యదేశ్చగా ఇంత పెద్ద మొత్తంలో బంగారం అక్రమ రవాణా అవుతూ, పట్టుబడుతుందంటే..!

ఐదేళ్ల సాధారణ రోజుల్లో ఎన్ని వేళ కోట్ల అక్రమ బంగారం రవాణా అవుతుందో సామాన్యులకి జవాబు దొరకని ప్రశ్న.

చోరీకి గురయ్యే బంగారు ఆభరణాలనే పూర్తి స్థాయిలో రికవరీ చేయలేని పోలీస్ వ్యవస్థ, వ్యాపారుల దగ్గరి దొంగ బంగారం లెక్కలు తేల్చలేని కమర్షియల్ టాక్స్ శాఖ సహకారం మెండుగా ఉన్నంత కాలం.. దొంగ బంగారు అక్రమ వర్తకం బహు భేష్ సుమీ..!!

ఎన్నికల కోడ్ వచ్చాకే.. మన జిల్లాలోనే నగర పోలీస్ వారు దాదాపు రూ. కోటిన్నర విలువ చేసే బంగారం, డెంకాడ పోలీస్ లు సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే బంగారంను పట్టుకోవడం సంచలనం. ఇటువంటి నిఘా వ్యవస్థ సాధారణ రోజుల్లో కూడా ఉండి ఉంటే.. ఎంత ప్రజాధనం ప్రభుత్వం ఖజానాకి చేరి ఉండేదో..!

*"ఈ వ్యవస్థలో అందరికీ వాటా కాబట్టే..బంగారం అంత ఖరీదన్న మాట..!?"*

38
1480 views